ఉత్తరప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాన్పూర్ లోని బస్మండి ప్రాంతంలో గల రెడిమేడ్ బట్టల మార్కెట్లు మసూద్ కాంప్లెక్స్, ఏఆర్ టవర్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లోనే భారీగా వ్యాపించి హమ్రాజ్ మార్కెట్ కు సైతం అంటుకున్నాయి. రంజాన్ సమయం కావడంతో వ్యాపారులు భారీగా స్టాక్ తెచ్చిపెట్టడంతో రూ.కోట్ల విలువైన బట్టలు, సామాగ్రి కాలిబూడిదయ్యాయి.