ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. వీటికి తోడు నేటి అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు పెరుగనున్నాయి. దీంతో వాహన యజమానులతో పాటు.. ప్రయాణికులపై మరింత భారం పడనుంది. అయితే గతేడాది 8-15% మేర పెంచిన కేంద్రం ఈ ఏడాది 5% మేర ఛార్జీలు పెంచింది. దీనివల్ల వాహనదారుడికి ప్రతి రూ. వందకి గాను మరో రూ.5 అదనపు భారం పడనుంది.