గుంతకల్లు రైల్వే డివిజన్ కు చెందిన చీఫ్ ట్రావెలింగ్ టికెట్ ఇస్పెక్టర్ (సిటీ టిఐ) జి. ఉదయ్ రాం సింగ్ ఈ ఏడాదిలో అత్యధికంగా రూ. 1. 16 కోట్ల అపరాధ రుసుములను వసూలు చేసి రికార్డు సృష్టించారు. డివిజన్ పరిధిలోని తిరుపతిలో సిటిటిఐగా పనిచేస్తున్న ఆయన డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సహచర ఉద్యోగులందరికంటే ఎక్కువ మొత్తాన్ని అపరాధ రుసుముల కింద వసూలు చేసినట్లు రైల్వే కమర్షియల్ అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఆయనకు డివిజన్ స్థాయి వీక్లీ అవార్డు దక్కనుంది. డివిజన్ అధికారులు ఉదయ్ రాం సింగ్ జోనల్ అవార్డు కోసం సిఫార్సు చేశారు.