రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తమ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, చేతనైతే వాటిని నిరూపించాలని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. యువ నాయకుడు లోకేశ్ పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని విమ ర్శించారు. జాకీ పరిశ్రమ, భూములపై ఆరోపణలు గుప్పిస్తున్న ఎమ్మెల్యే ఆ పరిశ్రమ నిర్వా హకులను డబ్బు కోసం బెదిరించింది వాస్తం కాదా అని ప్రశ్నించారు. ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న దందాల గురించి నారా లోకేశ్ మాట్లాడుతాడనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఇవి పునరావృతమైతే ఉపేక్షించేదిలేదన్నారు.