ఒడిశాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ బొలెరో వాహనం కాలువలోకి దూసుకెళ్లింది. సంబల్పుర్ వద్ద అదుపు తప్పిన వాహనం కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ఉన్నారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.