గుంటూరు: ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు అత్యాధునిక సీయామ్ యంత్రాలు ఎట్టకేలకు గురువారం సమకూర్చారు. ఇవి అందుబాటులో లేక శస్త్ర చికిత్సలు వాయిదా పడేవి, కొత్త పరికరాల సహాయంతో శస్త్ర చికిత్సలు సులువుగా వేగంగా పూర్తి చేసే అవకాశం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. సీయామ్ యంత్రాలు వినియోగించుకుని రోగులకు సరైన పద్ధతిలో ఇంప్లాయింట్స్, క్లిప్స్, ప్లేట్స్, రాడ్స్ వంటి పరికరాలు సరైన పొజిషన్లో ఉన్నాయా లేదని సరి చూసుకుంటారు.