ప్రత్తిపాడు మండలంలో లో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాకర్ల జయకృష్ణ 23 గతంలో సొంతగా వ్యవసాయం చేశారు. ఈ సమయంలో అప్పుల పాలయ్యారు. ప్రస్తుతం ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్న అప్పులు తీర్చాలేక బాధపడుతున్నారు. అందరూ నిద్రిస్తుండగా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి తల్లి వెంకటరత్నం ఫిర్యాదుతో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.