శ్రీ సత్య సాయి జిల్లా చిలుమటూరు మండలం టేకులోడు గురుకుల బాలికల పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని మృతి.శ్రీ సత్య సాయి జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంస్థజిల్లాచైర్మన్ చెరుకూరిగంగులయ్య,వర్కింగ్ చైర్మన్ కోట్ల మల్లికార్జున, జిల్లా మహిళా చైర్పర్సన్ అంజలి , జిల్లా జాయింట్ సెక్రటరీ , కృష్ణప్ప, సాకే ఆంజనేయులు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈ మృతికి కారుకులైన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ని , అక్కడ పనిచేస్తున్న ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, నైట్ డ్యూటీ టీచర్స్ ను, వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇలా గురుకుల పాఠశాలలో బాలికలు మరణిస్తూ ఉంటే ప్రభుత్వ స్పందన లేదు మరియు ఏదో కుంటి సాకులు చెప్పి మాఫీ చేస్తున్నారు. దీనిమీద నిజనిర్ధారణ కమిటీ వేసి మరణానికి కారుకులైన వారి పైన కఠిన చర్యలు తీసుకొని ఆ విద్యార్థికి వెంటనే 30 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఐదు ఎకరంల భూమి గట్టిగా డిమాండ్ చేసారు. ప్రభుత్వం నుంచిఅలా ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులు అన్ని జిల్లాలలో రాస్తారోకో లు, ధర్నాలు, చేపడతామనితెలియచేసారు.