అనంతపురం జిల్లా, కుందుర్పి మండల పరిధిలోని కరిగానిపల్లిలో పెళ్లి కాలేదన్న బాధతో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... కరిగానిపల్లికి చెందిన ఈరన్నకు ముగ్గురు కుమారులు. మూడో కుమారుడు సోమనాథ్ పదవ తరగతి ఫెయిలై తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తుండే వాడు. అయితే తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను అడిగేవాడు. పెళ్లి సంబంధాలు చూసినప్పటికీ ఎక్కడా సరిపోలేదు. దీంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి సాయంకాలం తల్లిదండ్రులతో రోజుమాదిరిగానే భోజనం చేసి రాత్రి 10 గంటలకు కొత్త ఇంటిలో నిద్రించేందుకు వెళ్లాడు. గురువారం ఉదయం తండ్రి తలుపుతట్టినా తీయకపోవడంలో ఇంటి వెనుకాల వైపు ఉన్న కిటికీలలో చూసేసరికి తాడుకు వేలాడుతూ కనిపించాడు. తండ్రి ఈరన్న ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి శవాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.