సత్తెనపల్లి: మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం ఉదయం 11: 00 గంటలకు కౌన్సిల్ హాల్లో జరుగుతుందని చైర్ పర్సన్ చల్లంచర్ల లక్ష్మీ తులసి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో అజెండాలోని 35 అంశాలపై చర్చించి, ఆమోదించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ఎక్స్ అఫిషియొగా మంత్రి అంబటి రాంబాబు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, అధికారులు, హాజరు కావాలని కోరారు.