తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుద్ధపల్లి దానియేలు మరియు వారి మిత్ర బృందం సుమారు 40 మంది ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే శివకుమార్ స్వయంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.