బోయలను ఎట్టి పరిస్థితుల్లో ఎస్టీ జాబితాలో చేర్చోద్దని నీలంపుట్టు గిరిజనులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ఆదివాసి జేఏసీ సంఘాల పిలుపు మేరకు హుకుంపేట మండలంలోని నీలంపుట్టు గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు స్వచ్ఛందంగా బంద్ చేపట్టారు. గిరిజనులు మాట్లాడుతూ మైదాన ప్రాంతంలో అంచలంచేలుగా ఎదిగిన బోయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేరుస్తామన్న తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.