రాష్ట్ర ప్రభుత్వం బోయ బెంతి ఒడియాలను గిరిజన జాబితాలో చేర్పిస్తూ తీర్మానం చేస్తూ ఆదివాసుల జీవితాలతో ఆటలాడుతుంటే జిల్లా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి వైఖరి ఏమిటని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణను పాడేరులోని పలు ప్రజా సంఘాలు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన ఈ తీర్మానాన్ని రద్దు చేయించాలని శుక్రవారం పిఓ గోపాలకృష్ణ వాహనాన్ని రోడ్డుపై అడ్డగించి ఆ సంఘం నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మన్యం బందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.