రూ. 30 కోట్ల ఆస్తి ఉండి, మనవడు ఐఏస్ అధికారి అయినా తినడానికి తిండిలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. చర్కీ దాద్రి ప్రాంతానికి చెందిన జగదీశ్ చంద్ర ఆర్య(78), భగాలీ దేవి(77) దంపతులు తినడానికి తిండిలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తమకు పాడైపోయిన రొట్టెలు ఇస్తూ, చాలా హీనంగా చూస్తున్నారని మనోవేదనతో లేఖ రాశారు. తమ ఆస్తిని ఆర్యసమాజ్ కు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.