చంద్రగిరి మండలంలోని పూతలపట్టు - నాయుడు పేట జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని గాయపడిన వారు చెప్పారు. సదుంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది ఉన్నారు. ఇందులో ఇద్దరు చనిపోయారు. మిగిలిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa