గుంటూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం స్పందన నిర్వహిస్తున్నట్లు డీఆర్ వో కే. చంద్రశేఖర రావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10: 30 గంటల నుంచి కలెక్టరేట్ లో ఉద్యోగుల వద్ద నుంచి అర్జీల స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలపై అర్జీలు అందచేయాలని సూచించారు.