సత్తెనపల్లి: గృహ సారధులు, సచివాలయాల కన్వీనర్లు చిత్త శుద్ధితో పనిచేయాలని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పై నియోజకవర్గస్థాయి సచివాలయాల కన్వీనర్లు సమావేశంలో పాల్గొన్నారు. మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు ప్రతి సచివాలయం పరిధిలో గృహ సారధులు, కన్వీనర్లతో ఈ కార్యక్రమం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.