బాలికపై లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలికి చూసింది. ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. ఫిబ్రవరిలో ఫాతిమా పురానికి చెందిన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన యువకుడు బలవంతంగా లైంగిక దాడి కి పాల్పడ్డాడు. పెద్దలకు చెప్పవద్దని బెదిరించాడు. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు రెండు రోజుల కిందట ఆరా తీయగా, బాలికకు జరిగిన విషయం చెప్పింది. తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.