గుంతకల్లు పట్టణంలోని హనుమేష్ నగర్ కు చెందిన రాజు, చిన్నా అను వ్యక్తులు శుక్రవారం కర్ణాటక మద్యం తరలిస్తుండగా స్వాధీనం చేసుకు న్నట్లు సెబ్ సీఐ మహేష్ కుమార్ తెలిపారు. పట్టణానికి చెందిన రాజు, చిన్నా అను వ్యక్తులు బళ్ళారి నుంచి ద్విచ్రవాహనంపై కర్ణాటకకు చెందిన 192 మద్యం టెట్రా ప్యాకెట్లు తీసు కువస్తుండగా పట్టుకున్నామని సీఐ తెలిపారు. ఐతే ఈ దాడుల్లో రాజు పట్టుబడగా మరో వ్యక్తి చిన్న పారి పోయాడన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రాజును కోర్టులో హాజరు పరచామన్నారు. స్వాధీనం చేసుకున్న ద్విచ్రవాహనం, మద్యం ప్యాకెట్లను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.