గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది. పోటా పోటీగా జరిగిన ఎన్నికలలో టీడీపీ సానుభూతి పరుడు కె. వి. కె సురేష్ విజయం సాధించారు. సురేష్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి గా ఉన్నారు. ప్రత్యర్థి అధికార పార్టీ సానుభూతిపరుడు కాసు వెంకటరెడ్డి పై 22 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఉన్నారు.