రాష్ట్రప్రభుత్వం మూడో విడత విడుదల చేసిన వైయస్సార్ ఆసరా నిధులు డ్వాక్రా సంఘాలకు అందజేయడానికి నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాసు హాజరవుతున్నారని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీడీవో డి. విశ్వేశ్వరరావు అన్నారు. శనివారం సాయంత్రం మండలపరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవో అధ్యక్షతన జరిగిన సమావేశంలో డ్వాక్రా సంఘాల ఏసి ఎస్ శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా రుణమాఫీ కోసం అందజేస్తున్న కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే కృష్ణదాసు చేతుల మీదుగా సంఘ సభ్యులకు చెక్కులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ ప్రసాద్ పాండా, ఏపిఎం గోవిందరాజులు, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు సీసీలు, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, ఈవోఏలు, హెల్ప్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.