ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కిండలంలో వరుసగా అనేక మంది మరణిస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేసి అందరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. అయినా సరే మరణాలు ఆగకపోవడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. చాలామంది పిల్లలను బడులకు వెళ్లనివ్వటం లేదు. అనేకమంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు.