ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్ పేసర్, కేకేఆర్ ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉమేశ్ రికార్డులకెక్కాడు. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజపాక్సేను ఔట్ చేసి ఈ అరుదైన ఘనత సాధించాడు ఉమేశ్ పంజాబ్‌పై ఇప్పటివరకు ఉమేశ్ 34 వికెట్లు పడగొట్టాడు. కాగా గతంలో ఈ రికార్డు బ్రావో పేరిట ఉండేది. బ్రావో ముంబైపై 33 వికెట్లు పడగొట్టాడు.