మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వాలన్ గ్రామ పొలంలో సుమారు 15 మంది కూలీలు ఉల్లిపాయలు కోయడానికి వెళ్లారు. ఈక్రమంలో అందరికీ ఒక్కసారిగా కళ్లలో మంటలు వచ్చాయి. దీంతో వారు ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు వారి కళ్లలో నుంచి పురుగులు, వాటి గుడ్లు వస్తున్నట్లు గమనించారు. కంటి పరీక్షలకు సంబంధించిన పూర్తి నివేదికలు వచ్చాక అసలు కారణం చెబుతామన్నారు.