ఏపీలో ఈ నెల 6 నుండి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి విడదల రజిని వెల్లడించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ విధానంలో ప్రతి 2 వేల జనాభాకు ఒక విలేజ్ క్లినిక్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక డాక్టర్ పబ్లిక్ హెల్త్ సెంటర్ లో ఉంటాడని, మరో వైద్యుడు 104 ద్వారా ఇంటింటింకీ వెళ్లి వైద్యం అందిస్తారని తెలిపారు.