ఓ యువతి తన తల్లితో కలిసి విషం తాగి, పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లాలో జరిగింది. పిలిభిత్ లోని సుంగడీ ప్రాంతానికి చెందిన కాజల్ ఠాకూర్ అనే యువతి తల్లితో కలిసి విషం తాగి, పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసింది. పోలీసులు తన తండ్రిని అక్రమంగా అత్యాచారం కేసులో ఇరికించారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. తమ చావుకి పోలీసులే కారణమని పేర్కొంది.