గురజాల పట్టణంలో స్థానిక చల్లగుండ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల మహిళలకు వైయస్సార్ ఆసరా చేయూత గా నిలుస్తుందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తూ వారి కుటుంబాలకు ఆసరాగా ఉంటూ ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలకు మూడో విడత వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ ఆయన చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం గురజాల పట్టణ, మండల మరియు దాచేపల్లి పట్టణ, మండల డ్వాక్రా మహిళలకు సంభందించి వైస్సార్ ఆసరా చెక్కులను డ్వాక్రా మహిళలకు 79 మంది అక్క చెల్లెమ్మ లకు కుట్టు మిషన్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎనుముల మురళీధర్ రెడ్డి, మండల కన్వీనర్ సిద్ధారపు గాంధీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య, వైసీపీ సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కెవి), డ్వాక్రా సంఘాల మహిళలు , అధికారులు , సిబ్బంది వైసిపి నాయకులు , తదితరులు పాల్గొన్నారు.