ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యను చంపిన భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2023, 10:38 AM

భార్యను భర్త హతమార్చిన ఘటన శనివారం వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రంపచోడవరం సాయినగర్ లో నివాసముంటున్న పిల్లాశివకృష్ణ, నాగమణి దంపతులు కొంత కాలంగా సాయినగర్ లో నివాసంఉంటున్నారు. నాగమణి భర్త శివకృష్ణ ఏపీ ట్రాన్స్ కొ లో కాంట్రాక్టు పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో భార్యతో తరచూ గొడవపడేవాడు నాగమణి తల్లి గుబ్బలమ్మ రెండురోజుల నుంచి కనిపించడం లేదని మార్చి 30న రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దింతో ఎస్సై మోహన్ కుమార్ నాగమణి భర్త శివకృష్ణను అదుపులోనికి తీసుకుని విచారించగా కుటుంబ కలహాలతో తానే ఒంటి వద్ద ఉన్న చున్నీ తో నాగమణి పీకకు చుట్టి చంపేశానని ఆ తర్వాత మృతదేహాన్ని గోని సంచిలో కట్టి గంగవరం మండలం సూరం పాలెం జలాశయంలో పడేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు శుక్రవారం జలాశయం గాలించగా మృతదేహం లభ్యమయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రంపచోడవరం ఎస్సై మోహన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com