నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి గృహ సారధులు, కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా సారధులు కన్వీనర్లు సమన్వయంతో పని చేసి వారం రోజులలో ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. వైసీపీ పార్టీ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు.