నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్( నాసా) 41వ అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సమ్మేళనం(ఐఎస్ డిఎస్)2023వ సంవత్సరంలోరవీంద్ర భారతి విద్యార్థులు విజయ దుందుభి మోగించారని రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎం. ఎస్. మణి, డైరెక్టర్ ఎం. ఎస్. రేవంత్ పేర్కొన్నారు. మేరకు ఎన్ఏడి రవీంద్ర భారతి పాఠశాలలో శనివారం విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు.
సందర్భంగా మాట్లాడుతూ నేషనల్ స్పేస్ సొసైటీలో దక్షిణ భారతంలోనే ప్రప్రధమంగా 2009వ సంవత్సరంలో మొదలైన రవీంద్ర భారతి విద్యాసంస్థల ప్రస్థానం గత 14 సంవత్సరాలుగా రవీంద్ర భారతి విద్యా సంస్థల ప్రణాళిక రచన విధివిధానాలు క్రమశిక్షణలనే ఆయుధాలుగా మలచి ప్రతి ఏడాది విజయబావుట ఎగరవేస్తూ రవీంద్రభారతికి సాటి ఏ సంస్థ కాదు పోటీ అంటూ వివిధ అంశాలలో విజయదుందుభి మోగిస్తున్న ఏకైక విద్యాసంస్థ రవీంద్ర భారతి మాత్రమేనన్నారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది 41వ అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సమ్మేళనం(ఐఎస్ డిఎస్)2023వ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 4500 ప్రవేశాలు 19 దేశాలు 26, 000 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో ప్రపంచ తృతీయ బహుమతిని రవీంద్ర భారతి విద్యాసంస్థల నుండి "జానస్"ప్రాజెక్ట్ కైవసం చేసుకుంది. దీంతో పాటుగా "ప్రోక్లస్"ప్రాజెక్ట్ విశిష్ట బహుమతిని సాధించిందని తెలిపారు.
జాతీయ అంతరిక్ష కమిటీ ఆధ్వర్యంలో ప్రిస్కో టెక్సాస్ లో (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) విజేతలకు బహుమతులనుఅందజేస్తారన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ విజేతలై జగజ్జేతలై నిలిచిన విద్యార్థులను ఆశీర్వదిస్తూ రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎం ఎస్ మణి మరియు డైరెక్టర్ ఎం. ఎస్. రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు.