గుడిపాల మండలంలోని కొన్ని ప్రాంతాల లో సేకరించిన భూమిని జాతీయ రహదారుల పనుల కోసం వెంటనే అప్ప గించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్అధికారులను ఆదేశించారు. శనివారం జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ మేఘ స్వరూప్, జాతీయ రహదారుల పిడి అర్చనతో కలసి సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా గుడిపాల మండలంలో కొత్తపల్లి, రామాపురం, కేజే పురం ప్రాంతాలలో కొంత మేరకుభూమిని అప్పగించాల్సిఉందని ఆ భూములలో చెట్లు లేదా ఇతరకట్టడాలు ఉంటే వాటినివెంటనే గుర్తించి చెట్లకు సం బంధించి వయసును బట్టి పరిహారం నిర్ణయించాలని ఆ పరిహారానికి వెంటనే ప్రతిపాదనలుపంపడం జరుగుతుందని ఆ విధంగా పనులు వేగవంతంగా జరిగేందుకు భూసేకరణ చేసివారికిఅప్పగించాలనన్నారు.