వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను గుర్తించకుండా ఏనాడూ పార్టీ జెండా మోయని వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంపై ఆదోని వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ‘ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లేకపోవడంతో పార్టీకి దూరమయ్యారు. పాతవారు ఎవరూ పార్టీ కార్యాలయం మెట్లు కూడా ఎక్కడం లేదు. కార్యకర్తల్లో అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేయాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమే’ అని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa