ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ రేపు తాడేపల్లిలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో సీఎం జగన్ మన ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై తనకున్న సమాచారం ఆధారంగా వారికి కర్తవ్యం నేర్పనున్నారు. గడప గడపకు కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు.