గుంటూరు జిల్లాలో సోమవారం నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను విధించినట్లు ఆయన వెల్లడించారు. ఎవరైనా మాల్స్ ప్రాక్టీస్ కి పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ తో పాటు స్మార్ట్ వాచీలను కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేదే లేదని స్పష్టం చేశారు.