దాచేపల్లి మండలం నారాయణపురంలోని అంజనీ పురం కాలనీకి చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బత్తుల హారిక (17) ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దాచేపల్లి ఆదర్శ పాఠశాలలో చదువుతున్న ఆమె పరీక్షలు సరిగ్గా రాయలేదని మనస్థాపనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.