శంకర కంటి ఆసుపత్రికి వచ్చి వ్యక్తి అదృష్టమైన సంఘటన పెదకాకానిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన వెన్నపోతు సుబ్బారెడ్డి మార్చి 26న శంకర్ కంటి వైద్యశాలకు కంటి వైద్య నిమిత్తం వచ్చారు. శుక్లాల ఆపరేషన్ చేయించుకునేందుకు 28న ఆసుపత్రి ఏర్పాటు చేసి బస్సులో గ్రామస్తులతో కలిసి పెదకాకాని శంకర్ కంటి ఆసుపత్రి చేరుకున్నాడు. తర్వాత ఆసుపత్రి వారు కంటి పరీక్షలు చేస్తున్న సమయంలో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో బంధువులు ఎంత వెతికిన కనిపించలేదు సుబ్బారెడ్డి అల్లుడు బాగిరెడ్డి సుధాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు ఆదివారం అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.