అనకాపల్లి జాతీయ రహదారిపై సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మెరకు అనకాపల్లి జాతీయ రహదారి శారద బ్రిడ్జి మీదుగా వెళ్తున్న లారీ ఒక్క సారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుండి వస్తున్న రెండు ప్రయివేటు బస్సులు ఒకదానికి ఒకటి బలంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ముందు వెళ్తున్న బస్సు డ్రైవర్ యోగేశ్వరావు (48) కి తీవ్ర గాయాలు కాగ వెనుక వస్తున్న మరో బస్సు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదిలా వుండగా ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్ళిపోయింది.
చిలకలూరి పేట నుండి విశాఖ లో ఒక చర్చ్ వద్ద ప్రార్ధనలో పాల్గునేందుకు ప్రయాణికులు రెండు బస్సుల్లో వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రాణహాణి లేకపోవటంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న హెచ్ ఓ పి పోలీసు లు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ప్రమాదంలో గాయపడ్డ బస్సు డ్రైవర్ యోగేశ్వరావు ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.