మూడో రోజు, ఒంటిమిట్ట కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం వటపత్ర శాయి అలంకారంలో, రాత్రి సింహవాహనంపై కోదండరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి మాడవీధుల్లో సింహవాహనంపై సీతారాముల ఊరేగింపు వైభవంగా జరిగింది. కాగా.. కోదండరాముడి కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అధికారులతో కలిసి ఒంటిమిట్టలోని కల్యాణ వేదిక ప్రాంతాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 5న జరిగే సీతారాముల కల్యాణానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa