కుప్పం పట్టణంలోని కొత్తపేటలో ఎస్ఈబీ అధికారులు కర్నాటక మద్యం స్థావరంపై ఆదివారం దాడులు నిర్వహించారు. ఎస్ఈబీ సిఐ కిషోర్ కుమార్ కథనం మేరకు. కొత్తపేటకు చెందిన ప్రకాష్, కుమార్ అనే యువకులు కర్నాటక మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశామని తెలిపారు. ఈ దాడుల్లో 1650 కర్నాటక మద్యం ప్యాకెట్లను సీజ్ చేశామని, మద్యంతో పట్టుబడిన ప్రకాష్, కుమార్ ల పై కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించామని ఆయన పేర్కొన్నారు. కర్నాటక మద్యం విక్రయించినా, తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని కిషోర్ కుమార్ హెచ్చరించారు.