వచ్చే ఎన్నికల్లో చంద్రబాబూ... 175 సీట్లలో పోటీ చేస్తావా? అని వైయస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశ్నించారు. ఏప్రిల్ 1న చంద్రబాబు అసత్యాలు, దూషణలతో అలౌకిక అనందం పొందాడు. 175 సీట్లలో వైయస్ఆర్సీపీని ఓడిస్తాను అంటున్నాడు. అసలు 175 నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు ఉంటుందా? ఫ్యాన్ గుర్తుపై అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? అలా పోటీకే దిక్కు లేని పరిస్థితి నీకుంటే మమ్మల్ని ఎలా ఓడిస్తావని నిలదీశారు. ఆదివారం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాతో మాట్లాడారు. మూడు నెలల క్రితం పార్టీ వాళ్లందరినీ కూర్చోబెట్టుకుని సుమారు 38 నియోజకవర్గాల్లో ఇంఛార్జ్లు లేరని వాపోయిన దిక్కుమాలిన స్థితి చంద్రబాబుది. కాబట్టి ఆ 38 నియోజకవర్గాలకు అభ్యర్థులను వెతుక్కో చంద్రబాబూ. కంగారెందుకు మరో ఏడాది ఉంది కదా? అని వ్యంగంగా మాట్లాడారు.