ప్రజలు ప్రతి ఎన్నికలో ఓడించడంతో అధికారం లేక టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిచ్చి ప్రేలాపనాలు పేలుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "భాష.. భాష" అంటూ మాట్లాడిన సోమిరెడ్డి ఏ భాష మాట్లాడుతున్నాడో ప్రజలందరూ చూస్తున్నారని విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, నిడిగుంటపాళెం సచివాలయ పరిధిలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా 2వ రోజు పుంజులూరుపాడు గ్రామంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రూ.1.30 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కాకాణి ప్రారంభించారు.