ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మళ్ళి పునః ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 03, 2023, 03:11 PM

గడప గడపకూ మన ప్రభుత్వం, ఏప్రిల్‌ 7వ తేదీన ప్రారంభం కానున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాలపై సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సీఎం జగన్ తో సమావేశం ముగిసిన అనంతరం అయన మాట్లాడుతూ....  ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఆగిపోయిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పునఃప్రారంభించే విధానం గురించి చర్చించారన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనుందని, ఈ కార్యక్రమంలో పార్టీ క్యాడర్‌తో పాటు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు పూర్తిస్థాయిలో పాల్గొనాలని ఆదేశించారన్నారు.  ఈ రెండు విషయాల గురించి పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సీఎం వైయస్‌ జగన్‌ కులంకశంగా చర్చించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com