ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్‌మీడియాతో పాటు యెల్లో బ్యాచ్ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పుల్‌స్టాప్ పెట్టారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. మంత్రుల మార్పుల సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు మరిన్ని వస్తాయన్న ఆయన.. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఈ నెల 13 నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించే అంశాన్ని సీఎం వైయస్ జగన్ ప్రకటించారు. ఎల్లోమీడియా ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. క్యాడర్ అంతా కూడా యాక్టివ్‌గా ఉండాలన్నారు. ముందస్తు ఎన్నికలు లేవని స్పష్టం చేశారు. మంత్రి వర్గ విస్తరణ కూడా ఉండదన్నారు. 60 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు లేవన్న ప్రచారం నమ్మొద్దని సూచించారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండటంతో పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలతో సీఎం వైయస్ జగన్ సమావేశమై తాజా రాజకీయ ప్రచారాలపై మాట్లాడారు.