పది పరీక్షల నిర్వహణపై పరీక్షాకేంద్రాలైన 75- దొడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, విజ్ఞాన దీప్తి స్కూల్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో సోమవారం నుండి ప్రారంభ మైన పదవతరగతి పరీక్షల నిర్వహణ ను ఆకస్మిక తనిఖీ చేసి, పగడ్బందీగా పరీక్షల నిర్వహణ జరగాలని చీఫ్ సూపరిండెంట్ లను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవ సరమైన అన్ని మౌలికసదుపాయాల ఏర్పాటు పై ఆరా చేశారు.
నో మొబైల్ జోన్ గా పరీక్షా కేంద్రాల్లో
చీఫ్ సూపరిండెం ట్ లతో సహాపరీక్షా కేంద్రంలోనికి ఎవ్వరి కీ మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరి కరాలు అనుమతి లేదన్నారు. పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి విజయేంద్ర రావు పాల్గొన్నారు.