స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 59,106 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకుని 17,398 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మారుతీ (2.50%), బజాజ్ ఫైనాన్స్ (1.86%), భారతీ ఎయిర్‌టెల్ (1.56%), ఎన్టీపీసీ (1.40%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.26%).
టాప్ లూజర్స్ : ఇన్ఫోసిస్ (-1.17%), ఐటీసీ (-1.17%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.89%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.49%), టాటా స్టీల్ (-0.43%).