కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరాటానిచ్చేలా సూరత్ సెషన్ కోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే మోదీ అనే ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ న్యాయస్థానం రెండేళ్ల జైలుశిక్ష విధించడం తెలిసిందే. దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఉంటోంది అని రాహుల్ వ్యాఖ్యలు చేయగా... గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, న్యాయవాది పూర్ణేశ్ మోదీ పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులోనే రాహుల్ కు జైలుశిక్ష పడింది.
అయితే, ఈ పరువునష్టం కేసులో కింది కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువును ఏప్రిల్ 13 వరకు విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే నేటి విచారణకు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వచ్చారు.