బద్వేల్ పట్టణంలోని 4 కోట్ల 40 లక్షలతో నిర్మించిన సీమాంక్ హాస్పిటల్ అప్ గ్రేడేషన్ ఆప్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 50 పడకల హాస్పిటల్ ను ఎమ్మెల్సీ డి, సి గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుద లు మంగళవారం ప్రారంభించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్లోని ఓపి విభాగంతో పలు విభాగాల వైద్య సేవలకు సంబంధించిన గదులను అడా చైర్మన్ సింగసాని గురు మోహన్, మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, సగర కార్పొరేషన్ చైర్మన్ రమణమ్మ సుందర రామిరెడ్డి, యద్దారెడ్డి, వైస్ చైర్మన్ సాయి కృష్ణ, బంగారు శీను తదితర నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ వై హిమాదేవి, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్, వైద్యాధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.