గుంతకల్లు రెవిన్యూ డివిజన్ భూముల వివరాలు డైరీని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం అనంతపురములో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రవీంద్ర మాట్లాడుతూ గుంతకల్లు రెవిన్యూ డివిజన్ ఏర్పడి ఏడాది కాలం అయిందని అన్నారు. గుంతకల్లు రెవిన్యూ డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోని సిబ్బంది వివరాలు, భూముల వివరాలు మరియు ఇతర వివరాలు డైరీలో పొందుపరచామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీఓ మధుసూధన్, గుంతకల్లు రెవిన్యూ డివిజన్ పరిధిలో గుంతకల్లు, గుత్తి, పామిడి, యాడికి, పెద్దవడుగూరు, వజ్రకరూరు, విడపన కల్లు, ఉరవకొండ ఎనిమిది మండ లాల తహశీల్దార్లు బి. రాము, మహ బూబ్ బాషా, సునీత, అలెగ్జాండర్, ఈరమ్మ, అనిల్ కుమార్, బ్రహ్మయ్య, సాబుద్దీన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.