ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయ డిగ్రీకి సంబంధించి విచారణ జరిపించాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య కోరింది. ఈ మేరకు ప్రతినిధుల బృందం సోమవారం ఉస్మానియా వీసీకి వినతిపత్రం అందించింది. 2019 ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ పూర్తికాలేదని పేర్కొన్న తమ్మినేని అదే ఏడాది ఉస్మానియాలో ఎల్ఎల్బీ అడ్మిషన్ ఎలా పొందారని ప్రశ్నించారు. డిగ్రీ లేకుండా ఎల్ఎల్బీలో ప్రవేశం ఎలా కల్పించారో విచారించాలని విజ్ఞప్తి చేశారు.