ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి మహిళలకి హితబోధ చేసిన ధర్మాన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 04, 2023, 12:17 PM

 జగన్‌ ఇంట్లో నుంచి ఏమైనా డబ్బులు తెచ్చి  ఇస్తున్నారా? అని కొంతమంది అంటున్నారని, ఎవరైనా ఇంట్లోది ఇస్తామంటే.. వారి ఇంటికే వెళదాం. పథకాల ద్వారా డబ్బులు తీసుకుని కూడా సంస్కారవంతమైన మాట రాకపోతే ఎలా? పద్దుకుమాలిన (ఉత్తరాంధ్ర యాసలో పనికిమాలినవాళ్లు అని అర్ధం) ఆడవాళ్లే ఇలా మాట్లాడతారు’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. మహిళలను శక్తిమంతులుగా మారుస్తున్న ప్రభుత్వానికి మరోసారి అధికారాన్ని అప్పగించాలని కోరారు. పథకాలు తీసుకుని ఓటు వేయకపోతే మీ చేతిని మీరు నరుక్కున్నట్లే అన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని పీఎ్‌సఎన్‌ఎం స్కూల్‌, రాగోలులో సోమవారం నిర్వహించిన ‘ఆసరా పంపిణీ’ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com